Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ పర్యటన.. గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభం

Author
Posted By Telangana Vaartha
| 14 Nov 2026, 07:10 PM | తాజావార్తలు Flash News
హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ పర్యటన.. గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభం

హైదరాబాద్, నవంబర్ 14: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్‌లో పర్యటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి గిగ్ వర్కర్ల సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జయభేరి గ్రౌండ్స్‌లో తెలంగాణ గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. డెలివరీ సిబ్బంది, క్యాబ్ డ్రైవర్లు తదితర గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

అంతకుముందు గిగ్ వర్కర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని గిగ్ వర్కర్లకు మద్దతు తెలిపారు.

ఇవి కూడా చదవండి

అనంతరం హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్ సమ్మిట్ ముగింపు సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించనున్నారు.

గిగ్ వర్కర్ల సంక్షేమం, వారి హక్కులు, సామాజిక భద్రత అంశాలు ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.