Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

35 లీటర్ల నాటు సారా పట్టివేత

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 10 Nov 2026, 09:18 PM | తెలంగాణ Telangana
35 లీటర్ల నాటు సారా పట్టివేత

తిరుమలగిరి 11 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఉదయం పూటనే గుడుంబా తయారీ కేంద్రాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి అక్రమంగా విక్రయం చేస్తున్న సారాను స్వాధీనం చేసుకున్నారు వివరాలకు వెళితే మున్సిపాలిటీ కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో గుగులోతు రజిత భర్త రమేష్ వద్ద 10 లీటర్లు స్వాధీనం చేసుకొని గుండ్ల జ్యోతి భర్త బిక్షపతి వద్ద 15 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు వాళ్ల ఇద్దరిని తుంగతుర్తి ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి తరలించి వారిపై కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సిఐ స్టీవెన్ మాట్లాడుతూ గ్రామాల్లో ఎవరైనా గుడుంబా తయారీ చేసినా, విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు తనిఖీ లో కానిస్టేబుల్స్ శ్రీకాంత్, శ్రీనివాస్ ,అనిల్ కుమార్, నరేష్ పాల్గొన్నారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.