హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ పర్యటన.. గిగ్ వర్కర్ల సంక్షేమ పథకం ప్రారంభం
హైదరాబాద్, నవంబర్ 14: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేడు హైదరాబాద్‌లో పర్యటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి గిగ్ వర్కర్ల సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని జయభేరి గ్రౌండ్స్‌లో తెలంగాణ గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. డెలివరీ సిబ్బంది, క్యాబ్ డ్రైవర్లు తదితర గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అంతకుముందు గిగ్ వర్కర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని గిగ్ వర్కర్లకు మద్దతు తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లో జరుగుతున్న భారత్...