Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

16న పిల్లల కోసం ప్రత్యేక ప్రజావాణి

Author
Posted By Telangana Vaartha
| 13 Nov 2026, 08:04 PM | తాజావార్తలు Flash News
16న పిల్లల కోసం ప్రత్యేక ప్రజావాణి

జోగులాంబ గద్వాల 13 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల.బాలల వారోత్సవాలలో భాగంగా గద్వాల ఐడిఓసి మీటింగ్ హాల్ నందు ఈ నెల16న సాధారణ ప్రజావాణితో పాటు పిల్లల కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

బాలల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం మరియు బాలల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాలలు తమకు ఎదురవుతున్న సమస్యలు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, వివక్ష, బాలల రక్షణ, బాల కార్మికులు, బాల్య వివాహాలు, పాఠశాలల్లో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై తమ ఫిర్యాదులు, వినతులను నేరుగా అధికారులకు సమర్పించవచ్చని తెలిపారు. బాలల సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
కావున జోగుళాంబ గద్వాల జిల్లాలోని 18 సంవత్సరాల లోపు బాలలు స్వయంగా గాని, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు బాలల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహాయంతో గాని తమ యొక్క ఫిర్యాదులను సమర్పించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.