16న పిల్లల కోసం ప్రత్యేక ప్రజావాణి
బాలల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం మరియు బాలల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాలలు తమకు ఎదురవుతున్న సమస్యలు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, వివక్ష, బాలల రక్షణ, బాల కార్మికులు, బాల్య వివాహాలు, పాఠశాలల్లో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై తమ ఫిర్యాదులు, వినతులను నేరుగా అధికారులకు సమర్పించవచ్చని తెలిపారు. బాలల సమస్యలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి, వాటిని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
కావున జోగుళాంబ గద్వాల జిల్లాలోని 18 సంవత్సరాల లోపు బాలలు స్వయంగా గాని, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు బాలల సంక్షేమం కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సహాయంతో గాని తమ యొక్క ఫిర్యాదులను సమర్పించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.