16న పిల్లల కోసం ప్రత్యేక ప్రజావాణి

జోగులాంబ గద్వాల 13 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల.బాలల వారోత్సవాలలో భాగంగా గద్వాల ఐడిఓసి మీటింగ్ హాల్ నందు ఈ నెల16న సాధారణ ప్రజావాణితో పాటు పిల్లల కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారం మరియు బాలల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బాలలు తమకు ఎదురవుతున్న సమస్యలు, విద్య, ఆరోగ్యం, పోషకాహారం, వివక్ష, బాలల రక్షణ, బాల కార్మికులు, బాల్య వివాహాలు, పాఠశాలల్లో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై...