Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

స్కూల్ బస్సుల వేగానికి కళ్లెం వేయాలి.. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించాలి

Author
Posted By A.Timma Gurudu
| 12 Nov 2026, 07:39 PM | Array
స్కూల్ బస్సుల వేగానికి కళ్లెం వేయాలి.. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించాలి

జోగులాంబ గద్వాల 12 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలకు చెందిన కొన్ని బస్సులు అతివేగంగా ప్రయాణిస్తుండటంతో ప్రజలు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం రాఘవేంద్ర కాలనీ టర్నింగ్ వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అతివేగంగా రావడంతో ఎదురుగా వచ్చే వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.
ముఖ్యంగా పట్టణంలోని ఇరుకైన రహదారులు, రద్దీ ప్రాంతాలు, కూడళ్లు, మలుపుల వద్ద స్కూల్ బస్సులు వేగం తగ్గించకుండా ప్రయాణించడం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. మలుపుల వద్ద ఎదురుగా ఎవరు వస్తున్నారో స్పష్టంగా కనిపించని పరిస్థితుల్లో బస్సులను వేగంగా నడపడం మరింత ప్రమాదకరం. బస్సుల్లో విద్యార్థులు ప్రయాణిస్తున్నారనే విషయాన్ని డ్రైవర్లు గుర్తుంచుకోవాలి.
ఈ నేపథ్యంలో జిల్లా ఆర్టీఓ అధికారులు స్పందించి ప్రైవేట్ పాఠశాలల బస్సుల వేగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పాఠశాలల యాజమాన్యాలు సైతం డ్రైవర్లకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసి, మలుపులు, కూడళ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తప్పనిసరిగా వేగం తగ్గించేలా సూచనలు ఇవ్వాలి. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే.. ప్రమాదాలు జరగకముందే అధికారులు, పాఠశాలల యాజమాన్యాలు అప్రమత్తం కావాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.