స్కూల్ బస్సుల వేగానికి కళ్లెం వేయాలి.. ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించాలి
జోగులాంబ గద్వాల 12 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల పట్టణంలో ప్రైవేట్ పాఠశాలలకు చెందిన కొన్ని బస్సులు అతివేగంగా ప్రయాణిస్తుండటంతో ప్రజలు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం సాయంత్రం రాఘవేంద్ర కాలనీ టర్నింగ్ వద్ద ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అతివేగంగా రావడంతో ఎదురుగా వచ్చే వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా పట్టణంలోని ఇరుకైన రహదారులు, రద్దీ ప్రాంతాలు, కూడళ్లు, మలుపుల వద్ద స్కూల్ బస్సులు వేగం తగ్గించకుండా ప్రయాణించడం ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. మలుపుల వద్ద ఎదురుగా ఎవరు వస్తున్నారో స్పష్టంగా కనిపించని పరిస్థితుల్లో బస్సులను వేగంగా నడపడం మరింత ప్రమాదకరం. బస్సుల్లో విద్యార్థులు ప్రయాణిస్తున్నారనే...