Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీ ని సస్పెండ్ చేయాలి

Author
Posted By Kadem Ravi
| 18 Nov 2026, 02:07 AM | తెలంగాణ Telangana
Video Thumbnail

ముఖ్యమైన పాయింట్స్:

  • విద్యార్థి సంఘ నాయకులు

అడ్డగూడూరు 17 నవంబర్ తెలంగాణ వార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని మంగమ్మగూడెం బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై అఘాయిత్యాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.ఈ ఘటనకు సంబంధించి వంటశాల కాంట్రాక్టర్ సోమన్న, తన భార్య అటెండర్ వీరితో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీ బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాలు,ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.ఈ ఘటనపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఆర్డిఓ కృష్ణ రెడ్డి, డీసీవో సుధాకర్,తహసీల్దార్ శేషగిరిరావు,సీఐ రవి,ఇన్‌చార్జ్ విజయ, తదితర అధికారులు స్పందించినట్లు తెలిపారు.ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులుగా తేలిన వారిని విధుల నుంచి తొలగించే చర్యలు తీసుకుంటామని అధికారులు వివరణ ఇచ్చినట్లు నాయకులు పేర్కొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బాలికల గురుకుల పాఠశాలల్లో విద్యార్థినుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని,ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం,విద్యాశాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై సమగ్ర విచారణ జరిపి, తప్పు చేసినట్లు నిర్ధారణ అయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.విద్యార్థినులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, పాఠశాలల్లో బాలికలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బాలెంల నరేష్,ఎమ్మెస్ఎఫ్ నాయకుడు బాలెంల జనార్ధన్,ఎస్ఎఫ్ఐ నాయకుడు బుర్ర అనిల్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్, టిఆర్ఎస్వి నాయకుడు అఖిల్ తదితరులు పాల్గొని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి.బాధ్యులుగా తేలిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.విచారణ పూర్తయ్యే వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని విధులకు నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.విద్యార్థినులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించాలి.బాధిత తల్లిదండ్రులు విద్యార్థి సంఘ నాయకులు,విద్యార్థినులకు న్యాయం చేసి,భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.