గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీ ని సస్పెండ్ చేయాలి

ముఖ్యమైన పాయింట్స్:విద్యార్థి సంఘ నాయకులు అడ్డగూడూరు 17 నవంబర్ తెలంగాణ వార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని మంగమ్మగూడెం బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై అఘాయిత్యాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.ఈ ఘటనకు సంబంధించి వంటశాల కాంట్రాక్టర్ సోమన్న, తన భార్య అటెండర్ వీరితో పాటు పాఠశాల ప్రిన్సిపాల్ ఝాన్సీ బాధ్యత వహించాలని విద్యార్థి సంఘాలు,ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.ఈ ఘటనపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఆర్డిఓ కృష్ణ రెడ్డి, డీసీవో సుధాకర్,తహసీల్దార్ శేషగిరిరావు,సీఐ రవి,ఇన్‌చార్జ్ విజయ, తదితర అధికారులు స్పందించినట్లు తెలిపారు.ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులుగా తేలిన వారిని విధుల నుంచి తొలగించే చర్యలు...