Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

విద్యార్థినులపై లైంగిక వేధింపులు ఫోక్సో కేసు నమోదు

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 17 Nov 2026, 07:47 PM | తెలంగాణ Telangana
విద్యార్థినులపై లైంగిక వేధింపులు ఫోక్సో కేసు నమోదు

అడ్డగూడూరు, 17 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిలో వంట మనిషిగా పనిచేస్తున్న శ్రీరాముల వెంకన్న (55) విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడం, ఈ విషయంపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు తల్లిదండ్రుల్లో ఆగ్రహం చేశారు. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థినులు బాధితులుగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన వెంకన్న గత మూడు నెలలుగా అడ్డగూడూరుకు చెందిన కాంట్రాక్టర్ సోమన్న ద్వారా గురుకుల పాఠశాలలో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యార్థినులతో అసభ్యంగా మాట్లాడుతూ, అనుచితంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అతని ప్రవర్తనతో విసిగిపోయిన విద్యార్థినులు ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినట్లు తీసుకెళ్లారు.. అయినప్పటికీ ప్రిన్సిపాల్ సరైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని విద్యార్థినులు శనివారం తమ తల్లిదండ్రులకు విషయం తెలియజేశారు. ఆగ్రహించిన తల్లిదండ్రులు మంగళవారం పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపాల్‌ను నిలదీసేందుకు ప్రయత్నించారు. అయితే పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బయటివారిని లోపలికి అనుమతించకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పాఠశాల లోపలికి అనుమతించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం అందడంతో ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో అధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు పాఠశాలకు చేరుకుని తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం ప్రిన్సిపాల్, విద్యార్థినుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అడ్డగూడూరు పోలీసులు వెంకన్నపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, జిల్లా అధికారి డీసీవో సుధాకర్‌రెడ్డి, రామన్నపేట సీఐ ఎం. రవి, స్థానిక తహసీల్దార్ శేషగిరిరావు పాఠశాలను సందర్శించి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. విచారణ అనంతరం బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అడ్డగూడూరు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి కేసు వివరాలను వెల్లడిస్తూ నిందితునిపై పోక్స్కో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని తెలిపారు. బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన గురుకుల పాఠశాలలో ఇలాంటి ఆరోపణలు రావడం, ఫిర్యాదు చేసినప్పటికీ ప్రిన్సిపల్ సకాలంలో స్పందించలేదనే విమర్శలు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినుల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి తావులేకుండా సమగ్ర విచారణ జరిపి, ఘటనకు బాధ్యులైన వారితో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.