విద్యార్థినులపై లైంగిక వేధింపులు ఫోక్సో కేసు నమోదు

అడ్డగూడూరు, 17 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.పాఠశాలలో కాంట్రాక్టు పద్ధతిలో వంట మనిషిగా పనిచేస్తున్న శ్రీరాముల వెంకన్న (55) విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడం, ఈ విషయంపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు తల్లిదండ్రుల్లో ఆగ్రహం చేశారు. ఈ ఘటనలో ఐదుగురు విద్యార్థినులు బాధితులుగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తుంగతుర్తి మండలం తూర్పుగూడెం గ్రామానికి చెందిన వెంకన్న గత మూడు నెలలుగా అడ్డగూడూరుకు చెందిన కాంట్రాక్టర్ సోమన్న ద్వారా...