Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

అర్వపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

Author
Posted By Telangana Vaartha
| 17 Nov 2026, 07:22 PM | తాజావార్తలు Flash News
అర్వపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

- బాధితులకు అందుబాటులో ఉండాలి.
- ఫిర్యాదులపై వేగంగా ప్రాథమిక విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి.
- పాత నేరస్థులు, షీటర్లు, గంజాయి కేసుల్లోని నిందితులపై నిరంతర నిఘా.
- గ్లోబల్ జియోట్యాగింగ్ ద్వారా నేరస్థుల కదలికలను పర్యవేక్షించాలి.

అర్వపల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, సిబ్బంది విధులు, పెట్రోలింగ్ నిర్వహణ, కేసుల పురోగతి తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని, కేసుల నమోదు విషయంలో ఎలాంటి జాప్యం చేయరాదని సూచించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా ప్రాథమిక విచారణను వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రజలకు భరోసా కల్పిస్తూ వారి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ పోలీసులు నిరంతరం అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మండల పరిధిలో అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. అలాగే పాత నేరస్థులు, నేరాలకు అలవాటు పడిన వ్యక్తులు, షీటర్లు, గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్నవారిపై నిరంతరం నిఘా ఉంచాలని ఆదేశించారు. గ్లోబల్ జియోట్యాగింగ్ విధానం ద్వారా వారిని పర్యవేక్షిస్తూ, ప్రతి ఒక్కరినీ మ్యాపింగ్ చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ప్రతి పోలీస్ అధికారి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ గారు సూచించారు.

ఈ తనిఖీలో నాగారం సీఐ నాగేశ్వరరావు, అర్వపల్లి ఎస్ఐ మధు సిబ్బంది ఉన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.