అర్వపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

- బాధితులకు అందుబాటులో ఉండాలి. - ఫిర్యాదులపై వేగంగా ప్రాథమిక విచారణ చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. - పాత నేరస్థులు, షీటర్లు, గంజాయి కేసుల్లోని నిందితులపై నిరంతర నిఘా. - గ్లోబల్ జియోట్యాగింగ్ ద్వారా నేరస్థుల కదలికలను పర్యవేక్షించాలి. అర్వపల్లి పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్‌లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, సిబ్బంది విధులు, పెట్రోలింగ్ నిర్వహణ, కేసుల పురోగతి తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించాలని, కేసుల నమోదు...