Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ప్రజా పాలన ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట ఎమ్మెల్యే సామెల్

Author
Posted By జేరిపోతుల రాంకుమార్
| 17 Nov 2026, 07:59 AM | తెలంగాణ Telangana
ప్రజా పాలన ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట ఎమ్మెల్యే సామెల్

తిరుమలగిరి 17 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రం లో శుభమస్తు ఫంక్షన్ హల్ లో జరిగిన తిరుమలగిరి నాగారం జాజిరెడ్డిగూడెం మండలాల చేయూత పించిని మంజూరు పత్రాలు పంపిని కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా విచ్చేసి లబ్ధిదారుల కు పంపిణీ చేసిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ వితంతువు ఒంటరి మహిళలకు పెన్షన్ల మంజూరు పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి మండలానికి 400 నుండి 500 వరకు నూతన పెన్షన్లను అందివ్వడం అభినందనీయం అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి పేదవారికి అండగా నిలబడి ఇందిరమ్మ ఇల్లు తో సహా 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తూ ఇందిరమ్మ ఇల్లును నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయల వ్యయాన్ని వెచ్చించడం తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మంజూరు పలు సంక్షేమ పథకాలు శ్రీకారం చుట్టామన్నారు పేద ప్రజలు గుడిసెలు ఉన్నవారు రేకులు పెంకు ఇండ్లు ఉన్నవాళ్లు ఇందిరమ్మ ఇంటిని సద్వినియోగం చేసుకోగలరని చేస్తున్నారని అన్నారు ఒంటరి మహిళలు వాళ్ళు వృత్తుల వారు గౌడ కులస్తులు తాటి చెట్టు ఎక్కే వారికి. మర మొగ్గలు నేసే వారికి పెన్షన్లను నూతనంగా 2000 రూపాయల ను అందువడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంగా పేదల ప్రభుత్వంగా అన్ని తానే సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి మన వంతు సహాయంగా వారికి అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు కావున ప్రజలు కాంగ్రెస్ పార్టీని దీవించి ఎప్పటికీ మరువకుండా మీకు తోడుగా ప్రభుత్వం శాయశక్తుల కృషి చేస్తుందన్నారు బడుగు బలహీన వర్గాల వారికి బీదవారికి వసతులను కల్పిస్తూ సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ ఎల్లవేళలా సేవలందిస్తున్న మా ప్రభుత్వానికి మీరు అండదండగా ఉండాలని మహిళలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులను కూడా అద్దెకు తీసుకోవడం వారికి సబ్సిడీపై బ్యాంకులలో రుణాలు అందిస్తూ ఈరోజు ఆర్టీసీ బస్సులను కూడా వారి ద్వారానే పెట్టడం జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వందల కొలది ఆర్టీసీ బస్సులను కూడా మహిళా సంఘాల రుణాల ద్వారా ప్రభుత్వాన్ని నడిపించడం ఆర్టీసీ బస్సులలో ఫ్రీగా మహిళలకు అందిస్తున్న మన ప్రభుత్వానికి అండదండగా ఉంటున్న మహిళలకు కృతజ్ఞతలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ సన్యాసిరావు మూడు మండలాల ఎంపీడీవోలు మండల పార్టీ అధ్యక్షులు సుంకర జనార్ధన్ మధుకర్ రెడ్డి వెంకట బిక్షం ఏఎంసీ చైర్మన్లు డైరెక్టర్లు పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.