Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

Author
Posted By Telangana Vaartha
| 16 Nov 2026, 07:40 PM | తాజావార్తలు Flash News
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.
జోగులాంబ గద్వాల నవంబర్ 16 తెలంగాణ వార్త ప్రతినిధి.
గద్వాల.చిన్న వయసులోనే వివాహాలు చేయడం వలన మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని, బాల్యవివాహాల రహిత జిల్లాగా జోగులాంబ గద్వాలను ప్రకటించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

ఐడిఓసి సమావేశపు మందిరంలో సోమవారం బాల్య వివాహ ముక్తభారత్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్య, వైద్య, సంక్షేమ శాఖలు సమన్వయంతో బాల్యవివాహాలను నిర్మూలించేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గట్టు, కేటీ దొడ్డి, మల్దకల్, ధరూర్ మండలాల్లో బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నందున అక్కడ ప్రతి గ్రామంలో సర్పంచ్, ఇతర అధికారులను ఆహ్వానించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు గట్టు మండలంలో ప్రత్యేకంగా ఒక సమన్వయకర్తను కూడా నియమించామన్నారు. అన్ని విద్యాసంస్థల్లో, గ్రామాల్లో బాల్యవివాహాల నిర్మూలనపై వివిధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈనెల 30న బాల్యవివాహాల నిర్మూలనకు జిల్లా వ్యాప్తంగా రథయాత్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

కిశోర బాలికలు బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి.

ఇవి కూడా చదవండి

స్నేహ కమిటీల ద్వారా కిశోర బాలికలు బాల్య వివాహాల నిర్మూలనకు తమవంతుగా కృషి చేయాలన్నారు. ఎక్కడైనా సరే బాల్యవివాహాలు జరుగుతున్నట్లు ముందుగా సమాచారం ఆయా గ్రామస్తులకే తెలుస్తుందని, సామాజిక బాధ్యతగా ఆయా గ్రామాల ప్రజలు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే చిన్నపిల్లల జీవితాలను కాపాడవచ్చన్నారు. పాఠశాలల యాజమాన్యాలు కూడా తమ వద్ద చదువుతున్న పిల్లలకు బాల్య వివాహాలు చేస్తున్నట్లు తెలిసిన వెంటనే అప్రమత్తమై నిర్మూలనకు సహకరించాలన్నారు. అంగన్వాడి కేంద్రాల నిర్వహకులు బాల్యవివాహాల నిర్మూలనలో ప్రధాన పాత్ర పోషించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు,
డిడబ్ల్యూఓ సునంద, డీసీపీవో నరసింహ, రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధి చిన్నమ్మ థామస్, తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.