బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్. జోగులాంబ గద్వాల నవంబర్ 16 తెలంగాణ వార్త ప్రతినిధి. గద్వాల.చిన్న వయసులోనే వివాహాలు చేయడం వలన మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని, బాల్యవివాహాల రహిత జిల్లాగా జోగులాంబ గద్వాలను ప్రకటించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. ఐడిఓసి సమావేశపు మందిరంలో సోమవారం బాల్య వివాహ ముక్తభారత్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్య, వైద్య, సంక్షేమ శాఖలు సమన్వయంతో బాల్యవివాహాలను నిర్మూలించేందుకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గట్టు, కేటీ దొడ్డి, మల్దకల్, ధరూర్ మండలాల్లో...