Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలకు పులికల్ విద్యార్థిని ఎంపిక

Author
Posted By Telangana Vaartha
| 16 Nov 2026, 07:38 PM | తాజావార్తలు Flash News
జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలకు పులికల్ విద్యార్థిని ఎంపిక

జోగులాంబ గద్వాల 16 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఐజ మండలం.* జనగాం జిల్లాలో నిర్వహించిన 70వ ఎస్‌జీఎఫ్ అండర్-14 స్టేట్ మీట్ టోర్నమెంట్‌లో తృతీయ బహుమతి సాధించిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బాలురు, బాలికల జట్లు.
* మధ్యప్రదేశ్ వేదికగా జరగనున్న నేషనల్ మీట్‌కు తెలంగాణ తరపున ఎంపికైన పులికల్ జెడ్పీహెచ్‌ఎస్ 8వ తరగతి విద్యార్థిని తెలుగు కృష్ణవేణి
ఈ నెల 12 నుండి 14వ తేదీ వరకు జనగాం జిల్లాలో జరిగిన 70వ ఎస్‌జీఎఫ్ అండర్-14 సెపక్ తక్రా బాల బాలికల రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ కం సెలెక్షన్ పోటీలలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా బాలురు మరియు బాలికల జట్లు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తృతీయ బహుమతిని సాధించడం జరిగింది. ఈ క్రీడా వేడుకల్లో మన ఉమ్మడి జిల్లా క్రీడాకారులు తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. ఈ టోర్నమెంట్‌లో ప్రదర్శించిన ప్రతిభ ఆధారంగా వచ్చే ఏడాది జనవరి 5 నుండి 9వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే జాతీయ స్థాయి మీట్‌కు తెలంగాణ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించడానికి జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం పులికల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థిని తెలుగు కృష్ణవేణి ఎంపిక కావడం విశేషం. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉషారాణి, పీఈటీ సుధీర్, యోగ ఉపాధ్యాయులు ఎం. రంగస్వామి మరియు పాఠశాల సిబ్బంది ఘనంగా అభినందించారు. గ్రామానికి మరియు పాఠశాలకు పేరు తెచ్చిన కృష్ణవేణి మరిన్ని శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలకు పులికల్ విద్యార్థిని ఎంపిక - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.