Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

నిందితుడిని చాకచక్యంగా పట్టుకొని రిమాండ్ కు తరలించిన ధరూర్, కేటీ దొడ్డి పోలీసులు

Author
Posted By Telangana Vaartha
| 16 Nov 2026, 02:00 AM | తెలంగాణ Telangana
నిందితుడిని చాకచక్యంగా పట్టుకొని రిమాండ్ కు తరలించిన ధరూర్, కేటీ దొడ్డి పోలీసులు

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకొని రిమాండ్ కు తరలించిన ధరూర్, కేటీ దొడ్డి పోలీసులు
జోగులాంబ గద్వాల 15 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:-
ధరూర్ గత కొన్ని రోజులుగా ధరూర్ మరియు కేటీ దొడ్డి మండలాల పరిధిలో గ్రామాలకు దూరంగా ఉన్న దుకాణాలను లక్ష్యంగా చేసుకుని, షాపుల షట్టర్లను పగలగొట్టి లోపలికి ప్రవేశించి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీస్ ఉన్నతధికారుల ఆదేశాల మేరకు ధరూర్ ఎస్సై తారక మరియు కేటీ దొడ్డి ఎస్సై శ్రీనివాసులు తమ సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు. మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా నిందితుడి ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు కేటీ దొడ్డి మండలం నందిన్నె గ్రామానికి చెందిన ఉజూరప్ప గా గుర్తించారు. పోలీసుల విచారణలో తాను తన స్నేహితులతో కలిసి పలు దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడు.
నిందితుడిపై ఇప్పటికే ధరూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసులు, కేటీ దొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా యాపలదిన్నె పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు నమోదై ఉన్నాయి. నిందితుడి దగ్గర నుంచి 14,300 రూపాయల నగదు, 1 మొబైల్ ఫోన్ మరియు హోండా షైన్ బైక్ ను స్వాధీన పరచుకొన్నారు. నిందితుడిని ఈ రోజు రిమాండ్ కు తరలించినట్లు దరూర్ ఎస్సై తెలిపారు. ఈ దొంగతనాల్లో పాల్గొన్న మిగతా వ్యక్తుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.