నిందితుడిని చాకచక్యంగా పట్టుకొని రిమాండ్ కు తరలించిన ధరూర్, కేటీ దొడ్డి పోలీసులు

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని చాకచక్యంగా పట్టుకొని రిమాండ్ కు తరలించిన ధరూర్, కేటీ దొడ్డి పోలీసులు జోగులాంబ గద్వాల 15 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ధరూర్ గత కొన్ని రోజులుగా ధరూర్ మరియు కేటీ దొడ్డి మండలాల పరిధిలో గ్రామాలకు దూరంగా ఉన్న దుకాణాలను లక్ష్యంగా చేసుకుని, షాపుల షట్టర్లను పగలగొట్టి లోపలికి ప్రవేశించి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీస్ ఉన్నతధికారుల ఆదేశాల మేరకు ధరూర్ ఎస్సై తారక మరియు కేటీ దొడ్డి ఎస్సై శ్రీనివాసులు తమ సిబ్బందితో కలిసి చాకచక్యంగా పట్టుకున్నారు. మొబైల్ ఫోన్ లొకేషన్ ఆధారంగా నిందితుడి ఆచూకీ గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు కేటీ...