Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

నూతన వాల్మీకి మహర్షి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహావిష్కరణ మహోత్సవం.

Author
Posted By A.Timma Gurudu
| 16 Nov 2026, 01:54 AM | తెలంగాణ Telangana
నూతన వాల్మీకి మహర్షి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహావిష్కరణ మహోత్సవం.

కోలాటాలు, డోలు మేళాలు, బాణాసంచాల నడుమ హనుమంతు నాయుడుకు ఘన స్వాగతం.
జోగులాంబ గద్వాల 15 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-
ధరూర్ మండల కేంద్రంలో నూతనంగా ప్రతిష్ఠించిన వాల్మీకి మహర్షి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహావిష్కరణ మహోత్సవంలో మాజీ జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, భారత రాష్ట్ర సమితి పార్టీ బాధ్యులు బాసు శ్యామల హనుమంతు నాయుడు పాల్గొని, వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టి, హోమం కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాసు శ్యామల హనుమంతు నాయుడుకు వాల్మీకి కమిటీ సభ్యులు శాలువలతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు బాసు శ్యామల హనుమంతు నాయుడుకు వాల్మీకి కమిటీ సభ్యులు, నాయకులు వైయస్ రాజశేఖర్ రెడ్డి చౌక్ నుంచి వాల్మీకి ఆలయం వరకు చిన్నారుల కోలాటాలతో, డోలు మేళాలతో, బాణాసంచా కాలుస్తూ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. హనుమంతు నాయుడు మాట్లాడుతూ మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆయన పట్ల ప్రజలకు ఉన్న గౌరవానికి, ఆయన ఆదర్శాలను భావితరాలకు పరిచయం చేయాలనే సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ సందర్భంగా ధరూర్ మండల కేంద్రంలో పండగ వాతావరణం నెలకొన్నదని అన్నారు. ఆదికవి మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి బోధించిన ధర్మం, సత్యం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని, సమాజంలో అందరికీ గౌరవం, సమాన అవకాశాలు, ఆత్మగౌరవంతో జీవించే హక్కు కల్పించాలనే భావనను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. మహర్షి వాల్మీకి జీవితం, ఆయన రచించిన రామాయణం భావితరాలకు నిరంతరం స్ఫూర్తినివ్వాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జి. రాఘవేంద్ర రెడ్డి, అల్లపాడు ప్రతాప్, శ్రీనివాస్ గౌడ్, ఆంజనేయులు, కోటేష్, లక్ష్మీకాంత్ రెడ్డి, రాజారెడ్డి, వెంకటేష్ నాయుడు, సర్పంచులు, పార్టీ శ్రేణులు, వాల్మీకి కమిటీ సభ్యులు, నాయకులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

నూతన వాల్మీకి మహర్షి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహావిష్కరణ మహోత్సవం. - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.