నూతన వాల్మీకి మహర్షి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహావిష్కరణ మహోత్సవం.
కోలాటాలు, డోలు మేళాలు, బాణాసంచాల నడుమ హనుమంతు నాయుడుకు ఘన స్వాగతం. జోగులాంబ గద్వాల 15 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ధరూర్ మండల కేంద్రంలో నూతనంగా ప్రతిష్ఠించిన వాల్మీకి మహర్షి ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహావిష్కరణ మహోత్సవంలో మాజీ జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు, భారత రాష్ట్ర సమితి పార్టీ బాధ్యులు బాసు శ్యామల హనుమంతు నాయుడు పాల్గొని, వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి, కొబ్బరికాయ కొట్టి, హోమం కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాసు శ్యామల హనుమంతు నాయుడుకు వాల్మీకి కమిటీ సభ్యులు శాలువలతో ఘనంగా సత్కరించారు. అంతకుముందు బాసు శ్యామల హనుమంతు నాయుడుకు వాల్మీకి కమిటీ సభ్యులు, నాయకులు...