Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ప్యాకేజీల పనులు తక్షణమే పూర్తి చేయాలి లేని పక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం

Author
Posted By A.Timma Gurudu
| 16 Nov 2026, 01:52 AM | తెలంగాణ Telangana
ప్యాకేజీల పనులు తక్షణమే పూర్తి చేయాలి లేని పక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం

99 మరియు 100 ప్యాకేజీల పనులు తక్షణమే పూర్తి చేయాలి లేని పక్షంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ రామచంద్రారెడ్డి
జోగులాంబ గద్వాల 15 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:-
ఇటిక్యాల మండలం అధ్యక్షుడు అబ్దుల్లా ఆధ్వర్యంలో సాబాద గ్రామం సమీపంలో ఉన్నటువంటి 99 100 ప్యాకేజీ పనులు పరిశీలించి అనంతరం వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం ఎంపీ డికే అరుణమ్మ కృషి తోనెట్టెంపాడు ప్రాజెక్టు ప్రారంభమైంది గద్వాల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్యాకేజీలు దాదాపు పూర్తయి ఆ రైతులందరికీ నీళ్లు వస్తున్నాయి కానీ అల్లంపూర్ నియోజకవర్గం సంబంధించి 99 & 100 ప్యాకేజీ సంబంధించి ఇంతవరకు పనులు చేస్తూనే చేస్తూనే ఉన్నారు కానీ ఏమాత్రం ముందుకు సాగడం లేదు మా రైతులకు ఒక్క చుక్క నీళ్ళు కూడా మా అల్లంపూర్ ప్రాంతానికి రాలేదు తెలంగాణ రాష్ట్రంలో ఇంతకు అల్లంపూర్ నియోజకవర్గం ఉందా లేదా అని వారు ప్రశ్నించారు ఎందుకంటే నెట్టెంపాడు కింద దాదాపు రెండు లక్షల ఎకరాలు పారాలి అదే అలంపూర్ నియోజకవర్గానికి దాదాపు 60 వేల ఎకరాలు పారాలి. ఇంతవరకు నెట్టెంపాడు 99 100 ప్యాకేజీ గాని అదేవిధంగా ఆర్డీఎస్ డి 40 వరకు గాని తుమిళ్ళ కూడా నత్తనడక నడుస్తుంది మా అలంపూర్ నియోజకవర్గంలో సాగునీరు పరిస్థితి చాలా ధనియంగా ఉంది ఎందుకు గతంలో టిఆర్ఎస్ గాని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గాని ఎందుకు పట్టించుకోవడం లేదు గతంలో కేసీఆర్ కుర్చీ చేసుకొని నీరు పరిస్తా అని తెలంగాణ రాష్ట్రం వస్తే అని కొల్లబొళ్ళు మాటలు చెప్పి అధికారం వచ్చిన తర్వాత కనీసం పట్టించుకోకుండా ఎలాంటి బ్యాలెన్స్ రిజర్వాయర్ లేకుండా తుమిళ్ల లిఫ్ట్ మంత్రంగా పూర్తి చేశారు వారు కూడా అదేవిధంగా మా పాలమూరు వాసి మా బిడ్డ అనుకోని చాలామంది రైతులు వారికి ఓటేసి ఈ యొక్క పాలమూరులో ఉన్నటువంటి 12 నియోజకవర్గాలు గెలిపిస్తే ఇంతవరకు అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి 99 100 ప్యాకేజీ గాని అదే విధంగా ఆర్డీఎస్ గానీ పూర్తి చేయక రైతులందరినీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని రామచంద్రారెడ్డి హేచ్చరించారు ఎందుకంటే రైతుల పరిస్థితి ఆగమ్య గోచంగా ఉంది కాబట్టి వెంటనే రైతులకు సంబంధించిన ప్యాకేజీలు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అల్లంపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి రాజగోపాల్ జిల్లా కార్యవర్గ సభ్యులు తిమ్మారెడ్డి ఇటిక్యాల ప్రధాన కార్యదర్శి పిఆర్ పి వడ్డేపల్లి మండల అధ్యక్షులు నాగరాజ్ ఐజ టౌన్ అధ్యక్షులు నరసింహులు నరేష్ శ్రీనివాసులు లక్ష్మణ్ గౌడ్ వెంకటేష్ శ్రీకాంత్ మరియు బూత్ అధ్యక్షులు శాలు రామకృష్ణ శేఖర్ సత్య రెడ్డి గొల్ల కృష్ణయ్య బోయ సుంకన్న తిమ్మన్న సాకలి వెంకటన్న సాకలి నరసింహులు మదిలేటి రంగన్న తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.