Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తెలంగాణలో 22-A, LRS బాధితులకు న్యాయం చేయాలి.

Author
Posted By Telangana Vaartha
| 15 Nov 2026, 05:51 PM | తెలంగాణ Telangana
తెలంగాణలో 22-A, LRS బాధితులకు న్యాయం చేయాలి.

పట్టా పాస్ బుక్, NALA, ప్లాట్ నంబర్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ డిమాండ్.
ప్రభుత్వానికి విజ్ఞప్తి - లక్షల మంది ప్రజల కష్టాలు తీర్చాలని కోరిక.
సూర్యాపేట, నవంబర్ 15:-
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో సామాన్య ప్రజలు, రైతులు, ప్లాట్లు కొన్న మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను వెంటనే పరిష్కరించి లక్షల మందికి న్యాయం చేయాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంకా వేల ఎకరాలు 22-A నిషేధిత జాబితాలో ఉండటం వల్ల రిజిస్ట్రేషన్లు కావడం లేదని, కోర్టు తీర్పులు వచ్చి 22-A నుండి తొలగించినా రెవెన్యూ రికార్డుల్లో అప్డేట్ చేయకపోవడం వల్ల రైతులు, ప్లాట్ల కొనుగోలుదారులు బ్యాంక్ లోన్లు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 2020లో LRS కోసం రూ.10 వేలు చెల్లించిన లక్షల మంది బాధితులకు నాలుగేళ్లయినా ఆమోద పత్రాలు ఇవ్వలేదని, రశీదు ఉన్నా ఇళ్లు కట్టుకోలేక, రిజిస్ట్రేషన్ చేసుకోలేక అద్దె ఇళ్లలోనే ఉంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి స్థానంలో భూ భారతి వచ్చినా పట్టా పాస్ బుక్ లు, మ్యుటేషన్ లు నెలల తరబడి పెండింగ్ లో ఉన్నాయని, 30 రోజుల్లో పట్టా పాస్ బుక్ ఇచ్చే స్పష్టమైన విధానం తీసుకురావాలని, NALA కన్వర్షన్ కు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, లేఅవుట్ అప్రూవల్ తోనే ఆటోమేటిక్ NALA ఇవ్వాలని, 2 ఎకరాల కంటే తక్కువ ఉంటే లేఅవుట్ కు పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల చిన్న రైతులు నష్టపోతున్నారని, RERA అనుమతి ఉంటే చాలని, ఒకే సర్వే నంబర్ లో 50 ప్లాట్లు ఉన్నా ప్లాట్ నంబర్, లేఅవుట్ మ్యాప్ తో రిజిస్ట్రేషన్ చేయకపోవడం వల్ల కొనుగోలుదారులకు తమ ప్లాట్ ఏదో తెలియడం లేదని, దీనికి G.O. ఇవ్వాలని, లింక్ డాక్యుమెంట్స్ ను 1954 నుండి కాకుండా 13 ఏళ్లకు పరిమితం చేయాలని, మార్కెట్ వాల్యూ ప్రతి ఏడాది పెంచడం వల్ల రిజిస్ట్రేషన్ ఫీజులు భరించలేకపోతున్నారని, దీన్ని వెంటనే ఆపాలని, HMDA/DTCP పర్మిషన్లకు 6 నెలల నుండి ఏడాది పడుతోందని సింగిల్ విండో విధానం తీసుకురావాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యలు పరిష్కరిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది ప్రజల కష్టాలు తీరతాయని, అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సూర్యాపేట రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, జలగం సత్యం గౌడ్. జిల్లా ప్రధాన కార్యదర్శి, వెన్న శ్రీనివాస్ రెడ్డి. రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మం పాటి అంజయ్య గౌడ్. జిల్లా కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్. జిల్లా సహాయ కార్యదర్శి, పట్టేటి కిరణ్. వెంకటరెడ్డి, రసీదు, మదనచారి. శేఖర్, రాపర్తి జానయ్య, తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.