తెలంగాణలో 22-A, LRS బాధితులకు న్యాయం చేయాలి.

పట్టా పాస్ బుక్, NALA, ప్లాట్ నంబర్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ డిమాండ్. ప్రభుత్వానికి విజ్ఞప్తి - లక్షల మంది ప్రజల కష్టాలు తీర్చాలని కోరిక. సూర్యాపేట, నవంబర్ 15:- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో సామాన్య ప్రజలు, రైతులు, ప్లాట్లు కొన్న మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను వెంటనే పరిష్కరించి లక్షల మందికి న్యాయం చేయాలని తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...