Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పట్ట భద్రుల గళం అయిత, బీసీ బిడ్డల స్వరం అయిత

Author
Posted By Telangana Vaartha
| 14 Nov 2026, 08:51 PM | తెలంగాణ Telangana
పట్ట భద్రుల గళం అయిత, బీసీ బిడ్డల స్వరం అయిత

- డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ - ⁠వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల MLC అభ్యర్థి
నిరుద్యోగ యువత ఆశయ సాధనకు కృషి చేస్తా
బహుజన బిడ్డను గెలిపిద్దాం ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుద్దాం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇన్చార్జ్ ఇస్మాయిల్

మహబూబాబాద్:- పాలక పక్షాలు సామాజిక న్యాయం పాటించకుండా అగ్రవర్ణాలకు పెద్దపీట వేయగా కాకతీయ విశ్వవిద్యాలయం నుండి తెలంగాణ ఉద్యమంలో అనేక సమస్యలు ఎదుర్కొని పోరాటం చేసిన బహుజన బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని గతంలో వాగ్దానాలు చేసిన వ్యక్తులు పాలక పక్షాలకు తోత్తులుగా మారిన సందర్భంలో విద్యార్ధి ఉద్యమ నాయకునిగా తమకు అండగా నిలుస్తానని నిరుద్యోగుల సమస్యలు తెలిసిన వాడిగా కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థి గా పిహెచ్డి సాధించి ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా పేదరికం నుంచి ప్రజా సమస్యలు తెలిసిన పౌరుడిగా మీ ముందుకు వస్తున్నానని మీలో ఒకడిగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల బిడ్డగా నన్ను ఆశీర్వదించి సేవ చేసే భాగ్యం కల్పించాలని తెలంగాణ రక్షణ సేన వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నలమాస శ్రీకాంత్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దళిత బీసీ వర్గాల బిడ్డగా మహబూబాద్ ప్రాంతానికి చెందిన ఒక బీసీ బిడ్డను ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో నిలిపి పేద వర్గాల అభ్యున్నతి కోసం కవితమ్మ చేస్తున్న కృషికి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులు అవకాశం కల్పించాలని ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ ఇస్మాయిల్ ప్రజలను కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం పేరుతో పార్టీ స్థాపించి రాజకీయ ప్రయోజనాల కోసం సొంత లాభాలు వాటాల కోసం భారతీయ రాష్ట్ర సమితిగా ఏర్పడి ప్రజల అభిప్రాయాలను ఉద్యమ ఆశయాలను నెరవేర్చకుండా భారత రాష్ట్ర సమితి ప్రజలను మోసం చేసిందని విద్యార్థి ఉద్యమకారులను విస్మరించి కేవలం ఆర్దిక అవసరాలే ప్రధాన అంశాలుగా అభ్యర్థులను నిలబెట్టి ఉద్యమకారులకు మోసం చేసిందని తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయిన వారిని పక్కన పెట్టి అంగ బలం అర్థ బలం ఉన్న వారిని రాజకీయాల ప్రాధాన్యతనిస్తూ ఉద్యమకారులకు మొండి చేయి చూపిందని అన్నారు.
అలాగే అధికార కాంగ్రెస్ పార్టీ అనేకమైన హామీలు ఇచ్చి ఎన్నికల్లో విజయం సాధించినాక హామీలన్నీ తుంగలో తొక్కి అధికారమే పరమావధిగా రాజ మేలుతూ ప్రజలను మోసం చేస్తుందని అన్నారు.
కేంద్రంలో అధికారం చాలా ఇస్తున్న బిజెపి యాట రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రజలకు కుచ్చుటోపి పెట్టిందని దేశంలో ఉన్నటువంటి ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే, పోస్ట్ ఆఫీస్, ఇంకా అనేక రంగాలు ప్రైవేట్ పరం చేస్తూ ప్రజలను హత పాతాళానికి తొక్కేస్తుందని ప్రజలతో సంబంధాలు లేని వారిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి స్థానిక ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితిలు తీసుకొస్తుందని యద్దేవా చేశారు.
బీసీ బిడ్డగా ప్రాంత వాసిగా ఉద్యమ నేతగా తాను చేసిన సేవలను గుర్తు ఉంచుకొని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆశీర్వాదంతో తనకిచ్చిన ఈ టికెట్ అశోక్ నగర్ సాక్షిగా నిరుద్యోగులుగా అవస్థలు పడుతున్న యువత అందరికీ తాను అండగా ఉంటానని గతంలో హామీలు ఇచ్చి గెలిచిన వ్యక్తులు అధికార పార్టీలకు తొత్తులుగా మారినట్లు తాను మారని ప్రమాణ పూర్తిగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు క్షేత్రస్థాయిలో తెలిసిన వ్యక్తిగా నెరవేరుస్తానని తనకు పట్టబద్రులు అవకాశం కల్పించి తన భుజాలపై చేతులు వేసి పనులు చేయించుకునే విధంగా నడుచుకుంటారని ఎమ్మెల్సీ అభ్యర్థి స్పష్టం చేశారు.
ఈ ప్రాంతం లో ఓ మానుకోట లిల్లీ ఫుట్ MLC ఉంటడు, పార్టీ కి ద్రోహం చేస్తూ దొంగే దొంగ అన్నట్టు బిల్డప్ ఇస్తాడు, MLC రవీందర్ రావు నోరు అదుపులో పెట్టుకోక పొతే నీ బాగోతాలు అన్ని నడి బజార్లో పెడుతాం బిడ్డ, ఒక్క నీ వెంట తిరిగిన నాయకుడిని అయినా సెటిల్ చేసినవా ఇప్పటి వరకు, గౌతమి కాలేజీ ప్లాట్స్ అన్ని ఖాబ్జా చేసినవ్, బండి పుల్లయ్య మొదలు శ్రీరామ్ భద్రయ్య, వేం నరేందర్ రెడ్డి శంకర్ నాయక్ నువ్వు మోసం చేయని నాయకులు ఎవరో చెప్పు రవీందర్ రావు అని శ్రీకాంత్ గౌడ్ గాటైన్ విమర్శలు చేసారు, విద్యాసంస్థల పేరు మీద ఎంతో మంది సిబ్బంది జీవితాలను ఆగం చేసిన దుర్మార్గుడు రవీందర్ రావు అన్నారు కండక్టర్ లక్ష్మరెడ్డి భూమిని ఖాబ్జా చేసిన కబ్జాకోరు రవీందర్ రావు అన్నారు దమ్ముంటే MLC కి రాజీనామా చేసి నాపైన నిల్చొవాలని సవాల్ విసిరారు శ్రీకాంత్ గౌడ్
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన మానుకోట జిల్లా అధ్యక్షులు గంధసిరి వేణు, మానుకోట పార్లమెంట్ ఇంచార్జి బోడ అనిల్ నాయక్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గుండు ఉమేష్ కుమార్, సంగెం హర్షిత్, రాజేష్, విద్యార్థి నేతలు పట్టబద్రుల అభ్యర్థులు పాల్గొన్నారు.

పట్ట భద్రుల గళం అయిత, బీసీ బిడ్డల స్వరం అయిత - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.