Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పిల్లల మార్కులే కాదు.. వారి మనసులనూ చదవాలి!

Author
Posted By Telangana Vaartha
| 14 Nov 2026, 12:29 AM |
పిల్లల మార్కులే కాదు.. వారి మనసులనూ చదవాలి!

విద్యార్థుల ఆలోచనలు, తల్లిదండ్రుల బాధ్యతలను ప్రశ్నించే చిత్రం ‘జయంత్ & ది జింగో పెన్ సినిమా
సూర్యాపేట జిల్లా బిడ్డ జయంత్ బాల కథానాయకుడిగా వెండితెరపైకి.. రేపు రాష్ట్రవ్యాప్తంగా విడుదల - సూర్యాపేటలో తిరుమల మల్టీఫ్లెక్స్లో
సూర్యాపేట: పిల్లలు చదువులో వెనుకబడితే మందలిస్తున్నామా..? ఇతర పిల్లలతో పోల్చి ఒత్తిడికి గురిచేస్తున్నామా..? కానీ వారి మనసులో ఏమి జరుగుతుందో, వారు ఎదుర్కొంటున్న సమస్యలేమిటో ఎప్పుడైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామా..? ఇలాంటి ఎన్నో ఆలోచింపజేసే ప్రశ్నలకు వెండితెరపై సమాధానం చెప్పే ప్రయత్నమే ‘జయంత్ & ది జింగో పెన్’ బాలల చిత్రం.
పిల్లల చదువు, వారి మానసిక సంఘర్షణలు, తల్లిదండ్రుల అవగాహన, చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాల్సిన ఆవశ్యకత వంటి సున్నితమైన అంశాలతో రూపొందిన ఈ చిత్రం నవంబర్ 14న రాష్ట్రవ్యాప్తంగా విడుదల కానుంది. సూర్యాపేట పట్టణంలోని తిరుమల మల్టీప్లెక్స్‌లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యాపేట జిల్లా నాగులపాటి అన్నారం గ్రామానికి చెందిన బొలిశెట్టి ప్రవీణ్ పోలీస్ శాఖలో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన భార్య బొలిశెట్టి దివ్యా ప్రవీణ్ నిర్మాణ బాధ్యతలు చేపట్టగా, వారి కుమారుడు జయంత్ ఈ చిత్రంలో బాల కథానాయకుడిగా నటించారు. విధి నిర్వహణతో పాటు కుటుంబం నుంచి వచ్చిన ఈ సృజనాత్మక ప్రయత్నం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
చదువులో వెనుకబడితే పిల్లలు వెనుకబడినట్లేనా?
ప్రతి విద్యార్థికీ ఒకే స్థాయి సామర్థ్యం ఉండదు. ఒక సబ్జెక్టులో వెనుకబడినంత మాత్రాన ఆ పిల్లల్లో ప్రతిభ లేదని భావించలేం. అలాంటి పరిస్థితుల్లో పిల్లలు ఎదుర్కొనే ఒత్తిడి, వారి అంతర్మథనం, ఆ సమస్యను అధిగమించే మార్గాలను హృద్యంగా ఈ చిత్రంలో చూపించారు.
మలయాళంలో విశేష ఆదరణతో పాటు దాదాపు ఎనిమిది అవార్డులు అందుకున్న చిత్రానికి రీమేక్‌గా దీనిని రూపొందించారు. ప్రముఖ నటులు తనికెళ్ల భరణి, సత్యం రాజేష్ తదితరులు నటించడం మరో ప్రత్యేకత.
ప్రతి తల్లిదండ్రి పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా!
వినోదం కోసమే కాకుండా, పిల్లలను అర్థం చేసుకోవడానికి, వారి ప్రతిభను గుర్తించడానికి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి ఈ చిత్రం ఒక మంచి ఆలోచనను అందిస్తుందని ఆశిస్తున్నారు. హింస, ఆర్భాటాలకు దూరంగా కుటుంబమంతా కలిసి వీక్షించదగిన ఈ చిత్రాన్ని సూర్యాపేట జిల్లా ప్రజలు ఆదరించాలని, ముఖ్యంగా ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలతో కలిసి థియేటర్‌కు వచ్చి సినిమా చూడాలని చిత్ర బృందం కోరుతోంది.
మన ప్రాంతానికి చెందిన జయంత్ బాల నటుడిగా వెండితెరపై అడుగుపెడుతున్న ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలు అతడిని ప్రోత్సహించి, ఈ మంచి ప్రయత్నానికి అండగా నిలవాలని సీఐ బొలిశెట్టి ప్రవీణ్ గారి బంధువులు, మిత్ర బృందం బందు శ్రీధర్ బాబు, బొలిశెట్టి మధు, బంధు వీరయ్య, తొగరు మల్లికార్జున్, పత్తిపాక వేణు, సంధ్యాల వినోద్, సోమిశెట్టి లింగయ్య సంద్యాల వెంకటనారాయణ గార్లు ఒక ప్రకటనలో కోరారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.