పిల్లల మార్కులే కాదు.. వారి మనసులనూ చదవాలి!
విద్యార్థుల ఆలోచనలు, తల్లిదండ్రుల బాధ్యతలను ప్రశ్నించే చిత్రం ‘జయంత్ & ది జింగో పెన్ సినిమా సూర్యాపేట జిల్లా బిడ్డ జయంత్ బాల కథానాయకుడిగా వెండితెరపైకి.. రేపు రాష్ట్రవ్యాప్తంగా విడుదల - సూర్యాపేటలో తిరుమల మల్టీఫ్లెక్స్‌లో సూర్యాపేట: పిల్లలు చదువులో వెనుకబడితే మందలిస్తున్నామా..? ఇతర పిల్లలతో పోల్చి ఒత్తిడికి గురిచేస్తున్నామా..? కానీ వారి మనసులో ఏమి జరుగుతుందో, వారు ఎదుర్కొంటున్న సమస్యలేమిటో ఎప్పుడైనా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నామా..? ఇలాంటి ఎన్నో ఆలోచింపజేసే ప్రశ్నలకు వెండితెరపై సమాధానం చెప్పే ప్రయత్నమే ‘జయంత్ & ది జింగో పెన్’ బాలల చిత్రం. పిల్లల చదువు, వారి మానసిక సంఘర్షణలు, తల్లిదండ్రుల అవగాహన, చిన్నారుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాల్సిన ఆవశ్యకత...