Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

సమాజాన్ని మేల్కొలిపే దిశగా జిల్లా రచయితల సంఘం

Author
Posted By Telangana Vaartha
| 14 Nov 2026, 12:26 AM | తెలంగాణ Telangana
సమాజాన్ని మేల్కొలిపే దిశగా జిల్లా రచయితల సంఘం

సూర్యాపేట(Suryapet):- సమాజంలో జరుగుతున్న పరిణామాలను అక్షరాల రూపంలో ప్రజలకు చేరవేస్తూ, ప్రజల్లో చైతన్యం కలిగించడమే లక్ష్యంగా సూర్యాపేట జిల్లా రచయితల సంఘం ముందుకు సాగుతోందని జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పెద్దిరెడ్డి గణేష్ తెలిపారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుధా బ్యాంకులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హుజూర్‌నగర్, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట నాలుగు తాలూకాల్లో రచయితల సంఘాలను ఏర్పాటు చేసి, జిల్లా స్థాయిలో కవులు, రచయితలను ఒకే వేదికపైకి తీసుకురావడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఈనెల 15న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్ లో అభినందన సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఈ సభకు జిల్లాలోని కవులు, రచయితలు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొంటారన్నారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రచయితల ప్రతిభను వెలికితీసి, వారందరినీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు నడిపించాలన్నది సంఘం ప్రధాన ఉద్దేశమన్నారు. సమాజహితమైన కథలు, కవిత్వం, సాహిత్య రచనల ద్వారా ప్రజలకు అవసరమైన సమాచారాన్ని అందించడంతో పాటు, సమాజంలో చోటుచేసుకుంటున్న అన్యాయాలు, సమస్యలపై అక్షరాలతో స్పందిస్తామని పేర్కొన్నారు.
రచయితలు ఏ రాజకీయ పక్షానికో కాకుండా ప్రజల పక్షాన నిలబడి తమ కలాలతో పోరాడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడం, ప్రజల్లో చైతన్యం, సామాజిక స్పృహ కలిగించడం, ప్రజలను మేల్కొలపడం జిల్లా రచయితల సంఘం ప్రధాన లక్ష్యాలని వివరించారు. సమావేశాలు, సాహిత్య కార్యక్రమాలు, రచనల ద్వారా ప్రజలకు చేరువవుతామని చెప్పారు.ప్రతి తాలూకాలో ప్రజాస్వామ్య పద్ధతిలో రచయితల సంఘాలను ఏర్పాటు చేసి, వాటిని జిల్లా సంఘంగా సమన్వయం చేయడం ద్వారా సూర్యాపేట జిల్లా రెండు తెలుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ప్రజా వాగ్గేయ కారుడు గోరటి వెంకన్న, అధ్యక్షులుగా మహదేవ్ వ్యవహరించనుండగా, సీనియర్ జర్నలిస్టు, ఈనాడు మాజీ ఎడిటర్ తాడి ప్రకాష్, కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు ప్రసేన్, తిరుపతికి చెందిన సప్తగిరి లిటరరీ ప్రతినిధి శ్రీశైలకుమార్ తదితర ప్రముఖులు హాజరుకానున్నారు. అదేవిధంగా సూర్యాపేట మున్సిపల్ ఛైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది జ్యోతి ప్రజ్వలన చేస్తారు. పెద్దిరెడ్డి రాజా, వై. వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్, బెజవాడ వెంకటేశ్వర్లు, షఫీ ఉల్లా తదితర నాయకులు ఇంకా సాహితీవేత్తలు పాల్గొననున్నారు అని తెలిపారు.ఈ సమావేశం లో మనం వికాస వేదిక సభ్యులు గెల్లి అంజన్ ప్రసాద్,వీరయ్య చిట్టిపాక, కక్కిరేణి చంద్ర శేఖర్,భోనగిరి భాస్కర్,తోట శ్యాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.