సమాజాన్ని మేల్కొలిపే దిశగా జిల్లా రచయితల సంఘం

సూర్యాపేట(Suryapet):- సమాజంలో జరుగుతున్న పరిణామాలను అక్షరాల రూపంలో ప్రజలకు చేరవేస్తూ, ప్రజల్లో చైతన్యం కలిగించడమే లక్ష్యంగా సూర్యాపేట జిల్లా రచయితల సంఘం ముందుకు సాగుతోందని జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పెద్దిరెడ్డి గణేష్ తెలిపారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సుధా బ్యాంకులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ హుజూర్‌నగర్, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట నాలుగు తాలూకాల్లో రచయితల సంఘాలను ఏర్పాటు చేసి, జిల్లా స్థాయిలో కవులు, రచయితలను ఒకే వేదికపైకి తీసుకురావడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఈనెల 15న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్ లో అభినందన సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.ఈ సభకు జిల్లాలోని కవులు, రచయితలు, జిల్లా...