Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ప్రహరీ గోడ హద్దు నిర్మించుకుంటే సమాచారం లేకుండా కూల్చారు

Author
Posted By Telangana Vaartha
| 13 Nov 2026, 12:02 AM | తాజావార్తలు Flash News
ప్రహరీ గోడ హద్దు నిర్మించుకుంటే సమాచారం లేకుండా కూల్చారు

అధికారులు న్యాయం చేయాలి
విలేకరుల సమావేశంలో బాధిత మహిళ ఆరోపణ
సూర్యాపేట:-
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తొమ్మిదో వార్డులో సర్వే నెంబరు 346, ప్లాట్ నెంబర్ 25 లో ఈదుల సునీత భర్త సుదర్శన్ పేరుపై 201 గజాల ఇండ్ల స్థలం ఉన్నదని దాంట్లోనే కొంతమేర ఇల్లు నిర్మించుకున్నామని మా ఇంటి ప్రక్కనే ప్రహరీ గోడ హద్దును నిర్మిస్తే మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా తమకు డాక్యుమెంట్ ఉన్నప్పటికీ సుమారు 20 రోజుల క్రితం కూల్చారని తొమ్మిదో వార్డు కు చెందిన బాధితురాలు ఈదుల సునీత ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని తొమ్మిదో వార్డులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భర్త ఈదుల సుదర్శన్ తో కలిసి ఆమె మాట్లాడారు. 2013 వ సంవత్సరంలో మా పెదనాన్న జిలుగుల వీరభద్రం నుంచి కొనుగోలు చేశామని, ఇతనికంటే ముందు రామచంద్రయ్య కు జిలుగుల వీరయ్య నుంచి వారసత్వం సంక్రమించిందని తమకు 2017 సంవత్సరం రిజిస్ట్రేషన్ అయిందని వాపోయారు. పక్కవారే రోడ్డును ఆక్రమించి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో, మున్సిపాలిటీ అధికారులకు తమకు న్యాయం చేయాలని వినతిని అందజేసినప్పటికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎలాంటి భూమిని ఆక్రమించలేదని కావాలనే పరిసర ప్రాంతాల వారు తమపై ఫిర్యాదు చేసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.