ప్రహరీ గోడ హద్దు నిర్మించుకుంటే సమాచారం లేకుండా కూల్చారు
అధికారులు న్యాయం చేయాలి విలేకరుల సమావేశంలో బాధిత మహిళ ఆరోపణ సూర్యాపేట:- సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తొమ్మిదో వార్డులో సర్వే నెంబరు 346, ప్లాట్ నెంబర్ 25 లో ఈదుల సునీత భర్త సుదర్శన్ పేరుపై 201 గజాల ఇండ్ల స్థలం ఉన్నదని దాంట్లోనే కొంతమేర ఇల్లు నిర్మించుకున్నామని మా ఇంటి ప్రక్కనే ప్రహరీ గోడ హద్దును నిర్మిస్తే మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా తమకు డాక్యుమెంట్ ఉన్నప్పటికీ సుమారు 20 రోజుల క్రితం కూల్చారని తొమ్మిదో వార్డు కు చెందిన బాధితురాలు ఈదుల సునీత ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని తొమ్మిదో వార్డులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భర్త ఈదుల సుదర్శన్...