Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

పేద విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ రూ.2 కోట్ల బృహత్తర అవకాశం

Author
Posted By Telangana Vaartha
| 12 Nov 2026, 07:44 PM | Array
పేద విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ రూ.2 కోట్ల బృహత్తర అవకాశం

మిషన్ 10th క్లాస్ – చదువుకో తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణ
ఐజ మున్సిపల్ చైర్మన్ గౌరవ శ్రీ సీఎం సురేష్ గారి చేతుల మీదుగా శ్రీరామ్ గ్రూప్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మిషన్ 10th క్లాస్ – చదువుకో తెలంగాణ’ విద్యా ప్రోత్సాహక కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఈరోజు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సీఎం సురేష్ గారు మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని, తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో శ్రీరామ్ గ్రూప్ ముందుకు వచ్చి రూ.2 కోట్ల నగదు బహుమతులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిల్లో నగదు బహుమతులు అందించనున్నారు.

ఇవి కూడా చదవండి

పదో తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా ఆత్మవిశ్వాసంతో చదువుతూ మంచి మార్కులు సాధించి, తమ ప్రతిభను నిరూపించుకోవాలి. ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో మంచి స్థాయికి ఎదగాలని సీఎం సురేష్ గారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో శ్రీరామ గ్రూప్ అధికారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సీఎం సురేష్ గారి మిత్రబృందం, పాల్గొన్నారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.