పేద విద్యార్థులకు శ్రీరామ్ గ్రూప్ రూ.2 కోట్ల బృహత్తర అవకాశం
మిషన్ 10th క్లాస్ – చదువుకో తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణ ఐజ మున్సిపల్ చైర్మన్ గౌరవ శ్రీ సీఎం సురేష్ గారి చేతుల మీదుగా శ్రీరామ్ గ్రూప్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మిషన్ 10th క్లాస్ – చదువుకో తెలంగాణ’ విద్యా ప్రోత్సాహక కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం సురేష్ గారు మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని, తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా విద్యార్థుల భవిష్యత్తుకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో శ్రీరామ్ గ్రూప్ ముందుకు వచ్చి రూ.2 కోట్ల నగదు బహుమతులతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం...