Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

వడ్డేపల్లి పీఏసీఎస్ నూతన చైర్మన్‌, వైస్ చైర్మన్‌ ప్రమాణ స్వీకారం

Author
Posted By A.Timma Gurudu
| 12 Nov 2026, 07:38 PM | Array
వడ్డేపల్లి పీఏసీఎస్ నూతన చైర్మన్‌, వైస్ చైర్మన్‌ ప్రమాణ స్వీకారం

రైతుల సంక్షేమమే సహకార సంఘాల ప్రధాన లక్ష్యం
నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఈ అల్లంపూర్ ప్రజల బాగు కొరకే
డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ ఎఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ శాసనసభ్యులు.

జోగులాంబ గద్వాల 12 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- వడ్డేపల్లి.మండలంలోని వడ్డేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన చైర్మన్‌గా ఎనుముల నాగరాజు, వైస్ చైర్మన్‌గా బి.రామకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలంపూర్ మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ పాల్గొన్నారు._
ఈ సందర్భంగా డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ మాట్లాడుతూ...! ఈ అలంపూర్ నియోజకవర్గ ప్రజలు నా పేరు పక్కన అలంపూర్ మాజీ శాసనసభ్యులు అనే పేరును శాశ్వతంగా నిలిపినందు వలన వారికి నా జీవితకాలం రుణపడి ఉంటానని నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఈ అల్లంపూర్ బాగు కొరకే నా తాపత్రయమని తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సహకారాలతో ఈ అలంపూర్ ను అభివృద్ధి పథంలో నడపడం కొరకు సాయశక్తుల కృషి చేస్తానని సహకార సంఘాలు రైతులకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ సహకారంతో వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడాలని నూతన చైర్మన్ ఎనుముల నాగరాజు, వైస్ చైర్మన్ బి.రామకృష్ణారెడ్డి లకు సూచించారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు పాలకవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతుల సంక్షేమం, అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అణివేశ్వర్ రెడ్డి , శ్రీశ్రీశ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ మాజీ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి , అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప , వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీను , ఆర్డీఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారామ రెడ్డి , వడ్డేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్న రెడ్డి , వాల్మీకి కమిటీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, మాజీ సింగల్ విండో అధ్యక్షులు సంకపురం రాముడు , వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.