Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

తెలంగాణ ESIలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Author
Posted By Telangana Vaartha
| 12 Nov 2026, 07:21 PM | తాజావార్తలు Flash News
తెలంగాణ ESIలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి

సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం: ESI JAC తెలంగాణ రాష్ట్రంలోని ESI ఆసుపత్రులు, వైద్య విభాగాల్లో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ESI JAC డిమాండ్ చేస్తోంది.

ఈ సందర్భంగా JAC ప్రధానంగా కింది డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతోంది. డైరెక్టర్ నియామకం: ESI డైరెక్టర్‌గా వెంటనే వైద్యుడిని నియమించాలి. సొసైటీ ఏర్పాటు నిలిపివేత: ESI ఆసుపత్రుల నిర్వహణకు సంబంధించి సొసైటీ ఏర్పాటు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న రామచంద్రపురం, నాచారం ESI ఆసుపత్రులను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలను నిలిపివేయాలి. ప్రమోషన్లు: అన్ని విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్లను వెంటనే చేపట్టాలి. కార్మికులకు మెరుగైన వైద్యం: ESI ఆసుపత్రులకు వచ్చే కార్మికులకు నాణ్యమైన వైద్యం అందించాలి. ల్యాబ్ పరీక్షలు, అవసరమైన మందుల కొరత లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి. సీనియర్ వైద్యులకు పదోన్నతులు: అర్హత, సీనియారిటీ ఆధారంగా సీనియర్ వైద్యులకు జాయింట్ డైరెక్టర్ (JD) హోదాలు కల్పించాలి. ESI అనేది కార్మికుల ఆరోగ్య భద్రతకు సంబంధించిన కీలకమైన వైద్య వ్యవస్థ. అందులో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను, కార్మికులకు ఎదురవుతున్న వైద్య సేవల ఇబ్బందులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదు. పై డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ESI JAC నిర్ణయించింది.
డా. చీమ శ్రీనివాస్ చైర్మన్
తెలంగాణ ESI JAC
JAC నాయకులు: శీనయ్య, వీరన్న గౌడ్, డా. కళ్యాణ్, డా. రవి, మోహ్తద్, విక్టోరియా, వాసు, వెంకటేష్, డా. వెంకట్ రెడ్డి.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.