తెలంగాణ ESIలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలి
సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం: ESI JAC తెలంగాణ రాష్ట్రంలోని ESI ఆసుపత్రులు, వైద్య విభాగాల్లో నెలకొన్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ESI JAC డిమాండ్ చేస్తోంది. ఈ సందర్భంగా JAC ప్రధానంగా కింది డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతోంది. డైరెక్టర్ నియామకం: ESI డైరెక్టర్గా వెంటనే వైద్యుడిని నియమించాలి. సొసైటీ ఏర్పాటు నిలిపివేత: ESI ఆసుపత్రుల నిర్వహణకు సంబంధించి సొసైటీ ఏర్పాటు ప్రక్రియను వెంటనే నిలిపివేయాలి. రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న రామచంద్రపురం, నాచారం ESI ఆసుపత్రులను కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నాలను నిలిపివేయాలి. ప్రమోషన్లు: అన్ని విభాగాల్లో పెండింగ్లో ఉన్న ఉద్యోగుల...