Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఐజలో అట్టహాసంగా నూతన పీఏసీఎస్ కమిటీ ప్రమాణస్వీకారం

Author
Posted By A.Timma Gurudu
| 11 Nov 2026, 09:03 PM |
ఐజలో అట్టహాసంగా నూతన పీఏసీఎస్ కమిటీ ప్రమాణస్వీకారం

* సామాజిక న్యాయపేట వెలుగొందాలని కాంక్షించిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
* అయిజ సింగిల్ విండో చైర్మన్‌గా కురువ సుజాత రాముడు, వైస్ చైర్మన్‌గా ఎస్సీ నాయకుడు దేవేంద్ర బాధ్యతల స్వీకరణ.
* ఎన్నికల భారం, ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా నామినేటెడ్ పద్ధతిలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించామన్న ఎస్‌.ఏ. సంపత్ కుమార్.
* కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రైతు సంక్షేమం, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ సాధ్యమయ్యాయని స్పష్టీకరణ.
జోగులాంబ గద్వాల 11 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:-
మండల పరిధిలో నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సింగిల్ విండో చైర్మన్‌గా సంకాపురం గ్రామానికి చెందిన కురువ సుజాత రాముడు, వైస్ చైర్మన్‌గా దేవేంద్రతో పాటు వివిధ వార్డుల డైరెక్టర్లు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్‌.ఏ. సంపత్ కుమార్ మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గంలో 99 శాతం రైతులు ఉన్నందున, ఎన్నికల ద్వారా జరిగే ఆర్థిక భారాన్ని, సామాజిక చిక్కులను నివారించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రివర్గం నిర్ణయం మేరకు నామినేటెడ్ పద్ధతిలో ఈ కమిటీని ఎన్నుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా అలంపూర్ పరిధిలోని ఏడు పీఏసీఎస్ స్థానాలను పూర్తి చేశామని, సామాజిక న్యాయం పాటించడంలో భాగంగా ఆర్య వైశ్య, కురువ, వాల్మీకి, ఎస్సీ వర్గాలకు సముచిత స్థానం కల్పించామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం మాయమాటలతో సరిపెట్టారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తోందని కొనియాడారు. రేవంత్ రెడ్డి తో ఉన్న సాన్నిహిత్యం వల్ల ఓడిపోయినప్పటికీ ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని పేదలకు చేరవేయగలుగుతున్నామని, త్వరలోనే అయిజ పీఏసీఎస్ రెండుగా విభజించబడి చిన్న తాండ్రపాడుకు మరో కొత్త పీఏసీఎస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అయిజ ప్రాంత రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి, కాంగ్రెస్ పార్టీ అండతో మరిన్ని అభివృద్ధి నిధులు తెస్తామని భరోసా ఇచ్చారు.
అనంతరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పీఏసీఎస్ చైర్మన్ కురువ సుజాత రాముడు మాట్లాడుతూ సంకపురం రాముడు కి గతంలో సింగిల్ విండోలో పనిచేసిన అనుభవం ఉందని, తనపై ఉంచిన నమ్మకంతో అయిజ సొసైటీని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని, రైతులకు అవసరమైన అన్ని సేవలను సకాలంలో అందిస్తామని తెలిపారు. వైస్ చైర్మన్ దేవేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, రైతుల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ సుజాత రాముడు, వైస్ చైర్మన్ దేవేంద్ర మరియు సభ్యులతో పాటు గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్షావల్లి ఆచారి, మండల అధ్యక్షుడు బడే సబ్, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ కుమార్, మేడికొండ లక్ష్మి కాంతారావు, అయిజ పట్టణ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు ప్రకాష్ గౌడ్, పులికల్ హనుమంతు, జానయ్య, జనార్దన్ రెడ్డి, ఆర్. శ్రీధర్, హనుమంతు, నరసింహ, జయన్న, సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఎంపీపీలు తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఐజలో అట్టహాసంగా నూతన పీఏసీఎస్ కమిటీ ప్రమాణస్వీకారం - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.