Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

సామూహిక సెలవును విజయవంతం చేయాలి

Author
Posted By Alli prashanth kumar
| 11 Nov 2026, 08:15 PM | తాజావార్తలు Flash News
సామూహిక సెలవును విజయవంతం చేయాలి

*సామూహిక సెలవును విజయవంతం చేయాలి*

*అన్నవరం రవికాంత్*

సామూహిక సెలవును విజయవంతం చేయాలి - Additional Image

వాజేడు తెలంగాణ వార్త రిపోర్టర్ :-

ఇవి కూడా చదవండి

తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూషనరీ పెన్షన్స్ ఎంప్లాయిస్ యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన ములుగు జిల్లా కేంద్రంలో తలపెట్టిన సామూహిక సెలవు ధర్మదీక్షను విజయవంతం చేయాలని సిపిఎస్ జిల్లా అధ్యక్షులు అన్నవరం రవికాంత్ పిలుపునిచ్చారు వాజేడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన కంట్రీబుషనరీ పెన్షనర్స్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు సిపిఎస్ విధానంలో ఉద్యోగులందరూ నష్టపోతున్నారని పదవి విరమణ తర్వాత కనీస అవసరాలు తీర్చుకోలేకపోతున్నారని వారందరిని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ తరానికి అలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు

*మేనిఫెస్టో అమలు చేయాలి*

*గుల్ల గట్టు సంజీవ రాష్ట్ర కార్యదర్శి*
కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో సిపిఎస్ ని రద్దు చేసి ఓ పి ఎస్ ను పునరుద్ధరిస్తామని చెప్పిన విధంగా మాట నిలబెట్టుకోవాలని సిపిఎస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి గుల్లగట్టు సంజీవ అన్నారు ప్రస్తుతం ఉన్న పెన్షన్ విధానంలో 30 సంవత్సరాలు సర్వీస్ చేసినా ఉద్యోగి 3 వేల రూపాయలు పెన్షన్ గా పొందుతున్నాడని దీనివలన కనీస అవసరాలు తీర్చుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల కన్నా ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే పెన్షన్ తక్కువగా ఉందని పేరుకే ప్రభుత్వ ఉద్యోగం అని రిటైర్ అయ్యాక పట్టించుకునే వారు లేరని అందుకే ప్రభుత్వం ఉద్యోగుల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సంజీవ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు 17న జరిగే సామూహిక సెలవుతో ఉద్యోగుల ఐక్యతను చాటి చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో వాజేడు మండలం విద్యాధికారి వెంకటేశ్వరరావు సిపిఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు జిల్లా మహిళా అధ్యక్షురాలు వనజ వాజేడు మండలం అధ్యక్షులు స్వరూప్ సింగ్ జేఏసీ నాయకులు సిందే రాజేష్ కరటూరి సతీష్ కుమార్ బాలాజీ రంగు ఆనంద్ ప్రభాకర్ రవి శ్రీకాంత్ వైశ్య తదితరులు పాల్గొన్నారు

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.