Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్‌లోకి సూర్యాపేట డిపో TJMU నాయకులు...

Author
Posted By Telangana Vaartha
| 11 Nov 2026, 05:03 PM |
ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్‌లోకి సూర్యాపేట డిపో TJMU నాయకులు...

ఎంప్లాయిస్ యూనియన్ పోరాటాలకు ఆకర్షితులై ఏఐటీయూసీ అనుబంధ సంఘంలో చేరిక....
సూర్యాపేట: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల హక్కుల సాధన కోసం ఎంప్లాయిస్ యూనియన్ (EU) చేస్తున్న పోరాటాలు, ఉద్యమ కార్యక్రమాలకు ఆకర్షితులై సూర్యాపేట ఆర్టీసీ డిపోకు చెందిన TJMU యూనియన్ నాయకులు ఎంప్లాయిస్ యూనియన్‌లో చేరారు.
డిపో కార్యదర్శి పి. మధు ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏఐటీయూసీ సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు దంతాల రాంబాబు సమక్షంలో నాయకులు ఎంప్లాయిస్ యూనియన్‌లో చేరారు. ఈ సందర్భంగా దంతాల రాంబాబు నూతనంగా చేరిన నాయకులకు యూనియన్ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాయకులు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం కోసం ఎంప్లాయిస్ యూనియన్ చేస్తున్న నిరంతర పోరాటాలకు మద్దతుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కార్మికుల ఐక్యతతోనే సమస్యలను పరిష్కరించుకోవచ్చని, భవిష్యత్తులో యూనియన్ చేపట్టే ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు చామల అశోక్ కుమార్, సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుగులోత్ రాజారాం, రిటైర్డ్ ఆర్టీసీ ఏడీసీ ఎన్.సి. సైదులు, ఏడీసీ కృష్ణ, డి. రాజు, ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు సేవియా, కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.