Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

సూర్యాపేట – ఖమ్మం హైవేపై కారు బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

Author
Posted By Telangana Vaartha
| 10 Nov 2026, 11:49 PM | క్రైమ్ న్యూస్ Crime News
సూర్యాపేట – ఖమ్మం హైవేపై కారు బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

సర్వీస్ రోడ్డుపై వడ్ల కుప్పలు.. సడన్ కటింగ్‌తో పొదల్లోకి దూసుకెళ్లిన కారు
సూర్యాపేట:-
సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై టేకుమట్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సర్వీస్ రోడ్డుపై ఉన్న వడ్ల కుప్పలను గమనించిన కారు డ్రైవర్ ఒక్కసారిగా కటింగ్ ఇవ్వడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పెను ప్రమాదం తృటిలో తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన వినోద్ (32) ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నారు. తన కొత్తగూడెం తన స్నేహితుడి ఇంటికి వెళ్లిన ఆయన, తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో గూగుల్ మ్యాప్స్, ఆపిల్ మ్యాప్స్ సూచనలను అనుసరిస్తూ ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు సర్వీస్ రోడ్డు మార్గంలో వెళ్తుండగా టేకుమట్ల వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న సూర్యాపేట రూరల్ పోలీసులు, ఖమ్మం–సూర్యాపేట ఎన్‌హెచ్‌ఏఐ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సర్వీస్ రోడ్లపై వడ్ల కుప్పలు, ఇతర అడ్డంకులు వాహనదారులకు ప్రమాదకరంగా మారుతున్నాయని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

సూర్యాపేట – ఖమ్మం హైవేపై కారు బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.