సూర్యాపేట – ఖమ్మం హైవేపై కారు బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

సర్వీస్ రోడ్డుపై వడ్ల కుప్పలు.. సడన్ కటింగ్‌తో పొదల్లోకి దూసుకెళ్లిన కారు సూర్యాపేట:- సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై టేకుమట్ల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సర్వీస్ రోడ్డుపై ఉన్న వడ్ల కుప్పలను గమనించిన కారు డ్రైవర్ ఒక్కసారిగా కటింగ్ ఇవ్వడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పెను ప్రమాదం తృటిలో తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన వినోద్ (32) ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నారు. తన కొత్తగూడెం తన స్నేహితుడి ఇంటికి వెళ్లిన ఆయన, తిరిగి హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో గూగుల్ మ్యాప్స్, ఆపిల్ మ్యాప్స్ సూచనలను అనుసరిస్తూ ఖమ్మం నుంచి...