Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

కార్తీక మాసంలో ఆకాశ దీపానికి విశిష్ట స్థానం

Author
Posted By Telangana Vaartha
| 10 Nov 2026, 07:18 PM | తాజావార్తలు Flash News
కార్తీక మాసంలో ఆకాశ దీపానికి  విశిష్ట స్థానం

కార్తీక మాసంలో ఆకాశ దీపానికి విశిష్ట స్థానం కలదని శ్రీ సంతోషిమాత దేవాల యం అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ తెలిపారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీ సంతోషి మాత దేవాలయంలో సోమవారం సాయంత్రం ఆకాశ దీపాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పితృదేవతలకు వెలుగు నిచ్చే పవిత్ర సాంప్రదాయం, హరిహరుల అనుగ్రహం కోసం దీపారాధన చేస్తారని తెలిపారు. కార్తీక మాసం లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం భక్తులు పవిత్రమైన ఆచారంగా భావిస్తారన్నారు. ఆకాశదీపం అంటే ఆకాశంలో వెలుగునిచ్చే దీపం అని అర్థమని, కార్తీక మాసంలో ఇంటి ఆవరణలో లేదా మిద్దెపై, దేవాలయాల్లో ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఆకాశదీపం దామోదరుడైన శ్రీమహావిష్ణువు సమర్పించే పవిత్ర కార్యంగా పురాణ సాంప్రదాయాలు వివరిస్తాయని, అలాగే శివకేశవు లను స్మరిస్తూ ఆకాశదీపాన్ని వెలిగించి ఆచారం కూడా ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో స్వర్గస్తులైన పితృదేవతలకు మార్గదర్శకంగా ఈ దీపాన్ని వెలిగిస్తారు అని తెలిపారు. దీపం వెలిగించడం అంటే కేవలం నూనె వత్తి తో జ్వాలన వెలిగించడం మాత్రమే కాదని మన జీవితాల్లో భక్తి జ్ఞానం మానవత్వం అనే వెలుగులను నింపుకోవడం అదే ఆకాశ దీపం అందించే గొప్ప ఆధ్యాత్మిక సందేశం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతోషిమాత దేవాలయం అధ్యక్షులు బ్రాహ్మణపల్లి మురళీధర్ కోశాధికారి కొత్త మల్లికార్జున్ కార్తీక మాస పూజల నిర్వాహక సభ్యులు గోపారపు రాజు , స్వరూప రాణి దంపతులు,దేవాలయ అర్చకులు అశోక్ మిశ్రా,దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.