కార్తీక మాసంలో ఆకాశ దీపానికి విశిష్ట స్థానం

కార్తీక మాసంలో ఆకాశ దీపానికి విశిష్ట స్థానం కలదని శ్రీ సంతోషిమాత దేవాల యం అర్చకులు బట్టారం వంశీకృష్ణ శర్మ తెలిపారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీ సంతోషి మాత దేవాలయంలో సోమవారం సాయంత్రం ఆకాశ దీపాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పితృదేవతలకు వెలుగు నిచ్చే పవిత్ర సాంప్రదాయం, హరిహరుల అనుగ్రహం కోసం దీపారాధన చేస్తారని తెలిపారు. కార్తీక మాసం లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం భక్తులు పవిత్రమైన ఆచారంగా భావిస్తారన్నారు. ఆకాశదీపం అంటే ఆకాశంలో వెలుగునిచ్చే దీపం అని అర్థమని, కార్తీక మాసంలో ఇంటి ఆవరణలో లేదా మిద్దెపై, దేవాలయాల్లో ధ్వజస్తంభం వద్ద ఆకాశ...