Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ఆత్మకూర్ (ఎస్) మండలంలో EWS సర్టిఫికెట్ల జారీపై సమగ్ర విచారణ జరిపించాలి

Author
Posted By Telangana Vaartha
| 10 Nov 2026, 07:07 PM | తాజావార్తలు Flash News
ఆత్మకూర్ (ఎస్) మండలంలో EWS సర్టిఫికెట్ల జారీపై సమగ్ర విచారణ జరిపించాలి

అర్హతలు పరిశీలించకుండా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలపై అధికారులు స్పందించాలి – తగుళ్ళ జనార్దన్ యాదవ్
ఆత్మకూర్ (ఎస్) మండల రెవెన్యూ అధికారికి EWS ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సర్టిఫికెట్ల జారీ విషయంలో నిబంధనలు పాటించడం లేదని, అర్హత లేని వారికి కూడా సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించాలని, మంగళవారం నాడు వినతి పత్రం అందజేసిన జన సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తగుళ్ళ జనార్దన్ యాదవ్. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం అర్హతలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాతే EWS సర్టిఫికెట్లు జారీ చేయాలి అని వారన్నారు. మండలంలో సర్టిఫికెట్ల జారీ ప్రక్రియపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ఈ నేపథ్యంలో ఎంతమందికి EWS సర్టిఫికెట్లు జారీ చేశారు, వారి ఆదాయ, ఆస్తుల వివరాలను ఏ విధంగా పరిశీలించారు, అర్హత ప్రమాణాలను పాటించారా, అనే అంశాలపై పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించాలని వారు కోరారు. EWS కోటా అనేది ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి మాత్రమే వర్తించాలి. ఎవరైనా అనర్హులు తప్పుడు వివరాలతో సర్టిఫికెట్లు పొందినట్లు అయితే వాటిని వెంటనే రద్దు చేసి, నిబంధనల ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలి వారు డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆత్మకూర్ (ఎస్) మండల తహసీల్దార్ EWS సర్టిఫికెట్ల జారీపై సమగ్ర విచారణ చేపట్టాలని ఈ సందర్భంగా కోరడం జరిగింది. విద్య, ఉద్యోగ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల అమలులో పారదర్శకత ఉండాలని, అర్హులకు అన్యాయం జరగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఈ అంశంపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా న్యాయబద్ధమైన విచారణ చేపట్టాలని జన సేవా సమితి డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో ఏర్పుల రవి తదితరులు పాల్గొన్నారు.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.