Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

వెలుగుమట్ల బాధితులపై కేసులు కాదు.. ఇళ్లు కూల్చిన అధికారులపై కేసులు పెట్టాలి

Author
Posted By Telangana Vaartha
| 10 Nov 2026, 12:08 AM | తెలంగాణ Telangana, పాలిటిక్స్ Politics
వెలుగుమట్ల బాధితులపై కేసులు కాదు.. ఇళ్లు కూల్చిన అధికారులపై కేసులు పెట్టాలి

మాపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి.. బాధితులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి : డాక్టర్ విశారదన్ మహరాజ్
ఖమ్మం, నవంబర్ 9:-
వెలుగుమట్ల భూదాన భూముల పోరాటానికి సంబంధించి డాక్టర్ విశారదన్ మహరాజ్‌పై ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో ఆయన పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా వెలుగుమట్ల భూదాన భూముల్లో నివాసముంటున్న పేదలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామున ఇళ్ల నుంచి బయటకు పంపించి ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించిన అధికారులు, ప్రభుత్వంపై కేసులు నమోదు చేయాల్సిందిపోయి, బాధితుల తరఫున పోరాడుతున్న తమపై కేసులు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. తమ పోరాటాల ఫలితంగా 300 మంది బాధితులకు అదే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇవ్వడం ప్రభుత్వం గతంలో చేసిన తప్పును అంగీకరించినట్లేనని పేర్కొన్నారు. తమపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకొని బాధితులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వెలుగుమట్లలో ఇంకా 20 ఎకరాల భూమి అందుబాటులో ఉందని, అర్హులైన మిగతా బాధితులను గుర్తించి వారికి కూడా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, లేనిపక్షంలో మరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పొడకంటి రాంబాబు మాట్లాడుతూ.. ఇది అణగారిన కులాల ఆత్మగౌరవ పోరాటమని, స్థానిక ఎమ్మెల్యే ఇకనైనా తన వైఖరిని మార్చుకొని మిగిలిన అర్హులైన బాధితులకు అదే ప్రాంతంలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు . ప్రముఖ న్యాయవాది వంజాకుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. పోరాట యోధులపై పెట్టిన తప్పుడు కేసులను పోలీసులు వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో పోలీసులపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు . ఈ కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు గర్జన్ , జేఏసీ జిల్లా కన్వీనర్ కేతవరపు కృష్ణారావు , కో-కన్వీనర్ రాజేష్ , కమిటీ సభ్యులు కటకం లక్ష్మి , కృష్ణ , ఉదయ్ , నవ్య , నరేష్ , ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు .

వెలుగుమట్ల బాధితులపై కేసులు కాదు.. ఇళ్లు కూల్చిన అధికారులపై కేసులు పెట్టాలి - Additional Image

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.