వెలుగుమట్ల బాధితులపై కేసులు కాదు.. ఇళ్లు కూల్చిన అధికారులపై కేసులు పెట్టాలి
మాపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి.. బాధితులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి : డాక్టర్ విశారదన్ మహరాజ్ ఖమ్మం, నవంబర్ 9:- వెలుగుమట్ల భూదాన భూముల పోరాటానికి సంబంధించి డాక్టర్ విశారదన్ మహరాజ్‌పై ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో ఆయన పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా వెలుగుమట్ల భూదాన భూముల్లో నివాసముంటున్న పేదలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామున ఇళ్ల నుంచి బయటకు పంపించి ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉల్లంఘించిన అధికారులు, ప్రభుత్వంపై కేసులు నమోదు చేయాల్సిందిపోయి, బాధితుల తరఫున పోరాడుతున్న తమపై కేసులు పెట్టడం...