Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసిన విద్యార్థుల యూనిఫామ్ల నాణ్యతను మెరుగుపరచాలి.

Author
Posted By A.Timma Gurudu
| 09 Nov 2026, 11:54 PM | తాజావార్తలు Flash News
Video Thumbnail

విద్యార్థులకు సరైన కొలతలతో నాణ్యమైన దుస్తులు అందించాలి.
నాసిరకం యూనిఫాంలపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
నాణ్యతలేని యూనిఫాములను వెంటనే మార్చి కొత్త యూనిఫామ్ లు పంపిణీ చేయాలి.
నాణ్యత లేని యూనిఫామ్‌లపై ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ .లేనందున అడిషనల్ కలెక్టర్‌ బి.నర్సింగ రావు కి ఫిర్యాదు!
జోగులాంబ గద్వాల 9 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:-
గద్వాల. జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో మరియు కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆశయంతో అందిస్తున్న ఉచిత పాఠశాల/ కళాశాల యూనిఫామ్‌ల పంపిణీలో తీవ్రస్థాయిలో నాణ్యత లోపాలు బయటపడ్డాయని,దుస్తుల తయారీలో నిబంధనలను గాలికొదిలేసి,విద్యార్థులపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న వైనంపై జోగులాంబ గద్వాల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ B. నర్సింగ రావు కి నేడు అధికారికంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా cpi జిల్లా కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ రంగన్న అలాగే aisf జిల్లా కార్యదర్శి ప్రవీణ్ లు మాట్లాడుతు నాణ్యత లేని మెటీరియల్: విద్యార్థులకు ఇస్తున్న యూనిఫామ్ దుస్తులు అత్యంత నాశిరకంగా (Low Quality) ఉన్నాయి. కనీసం రెండుసార్లు ఉతికితే చిరిగిపోయేలా ఉన్న ఈ బట్టలను పిల్లలు ఎలా వేసుకోవాలని ప్రశ్నించారు.? దుస్తుల తయారీలో కాలర్ల వద్ద ఉపయోగించాల్సిన నాణ్యమైన 'కాన్వాస్' లాంటి ప్రాథమిక మెటీరియల్‌ను కూడ వాడకుండా చాలా నాసిరకంగా కుట్టించారు అని అన్నారు.
విద్యార్థుల శరీర కొలతలు (Measurements) సరిగ్గా సేకరించకుండానే ఇష్టానుసారంగా దుస్తులను కుట్టించి పంపిణీ చేయడం వల్ల పిల్లలకు అవి అస్సలు సరిపోవడం లేదని,పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన వస్తువులను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మరియు అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతుందని, తక్షణమే ఈ నాసిరకం దుస్తుల పంపిణీని నిలిపివేసి, నిబంధనల ప్రకారం నాణ్యమైన, సరైన కొలతలతో కూడిన యూనిఫామ్‌లను విద్యార్థులకు అందించాలని మరియు దీనికి కారణమైన వారిపై తక్షణ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో Aiyf యువజన నాయకుడు వెంకటేష్ , డీఎస్పీ నాయకుడు కృష్ణంరాజు,తదితరులు పాల్గొనడం జరిగింది.

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.