Loading Time...
మెనూ

News App

వార్తల కోసం యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి

గంజాయి, డ్రగ్స్ అక్రమ విక్రయాలను అరికట్టాలి

Author
Posted By Telangana Vaartha
| 09 Nov 2026, 08:13 PM | తాజావార్తలు Flash News
గంజాయి, డ్రగ్స్ అక్రమ విక్రయాలను అరికట్టాలి

విద్యార్థులు, యువత భవిష్యత్తును కాపాడాలి – పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు హాలింపాష
జోగులాంబ గద్వాల 9 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.
గద్వాల. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.

ఈ మేరకు పిడిఎస్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఎస్‌ఐ అనంతరెడ్డి కి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు హాలింపాష మాట్లాడుతూ.. జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడకుండా పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్ల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని కోరారు.
జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి గంజాయి, డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తులను, ముఠాలను గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువతకు మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మత్తుకు బానిసలైన యువతకు వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందించాలని కోరారు.

ఎక్సైజ్, పోలీస్, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి జోగులాంబ గద్వాల జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పిడిఎస్యు నాయకులు డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు హాలింపాష, కార్తీక్, విజయ్, ఖలీమ్ తదితరులు పాల్గొన్నారు...

వార్తల అలర్ట్స్ పొందండి!

లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్, అప్‌డేట్స్ నేరుగా మీ ఇమెయిల్‌కి పొందడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.