గంజాయి, డ్రగ్స్ అక్రమ విక్రయాలను అరికట్టాలి

విద్యార్థులు, యువత భవిష్యత్తును కాపాడాలి – పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు హాలింపాష జోగులాంబ గద్వాల 9 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.గద్వాల. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పిడిఎస్యు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ ఎస్‌ఐ అనంతరెడ్డి కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్షులు హాలింపాష మాట్లాడుతూ.. జిల్లాలో మత్తు పదార్థాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌కు...